కాంగ్రెస్‌, ఆప్‌ పార్టీలు ముస్లింలను రెచ్చగొడుతున్నారు

షహీన్‌బాగ్‌లో ఆందోళనకు మద్దతు ఇస్తు అల్లరు ప్రోత్సహిస్తున్నారు

Amit Shah
Amit Shah

న్యూఢిల్లీ: ఢిల్లీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో కేంద్ర హోంమంత్రి, బిజెపి అగ్రనేత అమిత్‌ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దేశ రాజధాని ఢిల్లీలో మూడొంతుల మంది పాకిస్థాన్‌ నుంచి వలస వచ్చినవాళ్లే ఉన్నారని అన్నారు. పాకిస్థాన్‌ నుంచి వచ్చిన శరణార్థులకు పౌరసత్వం అందించేందుకే తాము సీఏఏ తీసుకువస్తే, కాంగ్రెస్‌, ఆప్‌ దాన్ని వ్యతిరేకిస్తున్నాయని మండిపడ్డారు. ఆ రెండు పార్టీలు సీఏఏకి వ్యతిరేకంగా ముస్లింలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని దుయ్యబట్టారు. షహీన్‌బాగ్‌లో ఆందోళనకు మద్దతు ఇస్తామని ప్రకటిస్తున్నారని, తద్వారా అల్లర్లను ప్రోత్సహించే చర్యలకు దిగారని అమిత్‌ షా విమర్శించారు. నెల రోజుల నుంచి కాంగ్రెస్‌ నేతలు షహీన్‌ బాగ్‌ ప్రాంతంలో పర్యటిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/