జగన్ విషయంలో తాను ఎనిమిది నెలల్లోనే రియలైజ్ అయ్యానుః రఘురామకృష్ణరాజు

ప్రశాంత్ కిశోర్ లో మార్పు ఎందుకు వచ్చిందో తనకు తెలియదని వ్యాఖ్య

MP Raghu Rama krishna Raju
MP Raghu Rama krishna Raju

అమరావతిః జగన్ విషయంలో మూడేళ్ల తర్వాత ప్రశాంత్ కిశోర్ రియలైజ్ అయినందుకు సంతోషమని… తనకు ఎనిమిది నెలలు పట్టిందని… ప్రజలకు ఇంకొంత సమయం పడుతుందేమో అని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఇప్పటికే చాలా మంది ప్రజలకు అర్థమయిందని చెప్పారు. ప్రశాంత్ కిశోర్ లో ఇంత మార్పు ఎందుకొచ్చిందో తనకు తెలియదని అన్నారు. అప్పులు చేసి సంక్షేమ పథకాలను అమలు చేయకూడదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారని తెలిపారు.

కాగా, మాజీ ఎంపీ వైయస్ వివేకానందరెడ్డి హత్యపై ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వంపై ఉందని ఆ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. బాబాయ్ హత్యపై టిడిపి నేత పట్టాభి పది ప్రశ్నలను సంధించారని… వాటికి సమాధానాలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. మరోవైపు ఆన్ లైన్ విద్యాస్థంస్థ బైజూస్ సహకారంతో ప్రభుత్వ పాఠశాలల్లో బోధన జరిపించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన తప్పుపట్టారు. బైజూస్ ఒక దివాళా తీసిన సంస్థ అని అన్నారు. బైజూస్ పేరుతో ఏపీలో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/