మంత్రి మల్లారెడ్డిపై ఫిర్యాదు చేసిన మహిళ

Minister Malla Reddy
Minister Malla Reddy

హైదరాబాద్‌: తెలంగాణ మంత్రి మల్లారెడ్డిపై ఓ మహిళ మనవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. మంత్రి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఆమె రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌ను కలిసింది. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ పరిధిలోని సూరారంలో మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన ఆస్పత్రులు, కాలేజీలు ఉన్నాయి. ఆస్పత్రికి కాలేజీకి మధ్య ఉన్న తన ఎకరం 33 గుంటల భూమిని కబ్జా చేసేందుకు మంత్రి ప్రయత్నిస్తున్నారని పి శ్యామలా దేవీ అనే మహిళ సంచలన ఆరోపణలు చేసింది. మంత్రి కొడుకు కూడా తనను బెదిరించారని బాధితురాలు ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలంటూ శ్యామల దేవీ హెచ్ఆర్సీని ఆశ్రయించారు. రెవెన్యూ సిబ్బంది, ఇతర అధికారులు కూడా మంత్రికి మద్దతు ఇస్తున్నారని బాధితురాలు ఆరోపించారు. ఈ విషయంలో పోలీస్ స్టేషన్‌కు వెళ్లినా న్యాయం జరగలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి మల్లారెడ్డి తన అనుచరులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని.. తనకు రక్షణ కల్పించాలని కమిషన్‌ను వేడుకున్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/