నేడు ఆరు నియోజకవర్గాల్లో రేవంత్ పర్యటన

తెలంగాణ ఎన్నికల ప్రచారం క్లైమాక్స్ కు చేరుకోవడం తో అన్ని పార్టీల నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. గల్లీ నేతల నుండి ఢిల్లీ నేతలు , ఇతర రాష్ట్రాల సీఎం లు సైతం తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇరాక్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి..నేడు ఆరు నియోజకవర్గాల్లో పర్యటించబోతున్నారు. నారాయణపేట్, దేవరకద్ర, మహబూబ్ నగర్, కామారెడ్డి, పఠాన్ చెరు, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో ప్రచార సభలలో రేవంత్ పాల్గొనబోతున్నారు.

ఉదయం 10గంటలకు నారాయణపేట్ బహిరంగ సభలో పాల్గొంటారు టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి. ఉదయం 11 గంటలకు దేవరకద్ర బహిరంగసభ లో .. మధ్యాహ్నం 12 గంటలకు మహబూబ్ నగర్ జనసభలో పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి పాల్గొంటారు. మధ్యాహ్నం 2గంటలకు రాహుల్ గాంధీతో కలిసి కామారెడ్డి బహిరంగ సభలో పాల్గొననున్నారు. సాయంత్రం 5.30 గంటలకు పఠాన్ చెరు జనసభ.. సాయంత్రం 6.30 గంటలకు శేరిలింగంపల్లి జనసభలో పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి పాల్గొంటారు.