హైదరాబాద్‌ అభివృద్ధిపై కెటిఆర్‌ ఆసక్తికర ట్వీట్‌

Minister KTR
Minister KTR

హైదరాబాద్‌: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ అరుదైన గౌరవాన్ని దక్కించుకోవడం… ప్రపంచ క్రియాశీల నగరాల లిస్టులో మొదటి స్థానంలో నిలవడంపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కెటిఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. తాజా ర్యాంకింగ్‌పై స్పందించడం ఆనందంగా ఉందన్న కెటిఆర్‌… ముఖ్యమంత్రి కెసిఆర్‌ నాయకత్వంలో హైదరాబాద్ దూసుకుపోతోందన్నారు. 2014లో టాప్ 20లో కూడా హైదరాబాద్ లేదన్న ఆయన… గత ఐదేళ్లుగా స్థిరమైన అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందన్నారు. 2019లో హైదరాబాద్… ప్రపంచంలో మరే నగరానికీ లేనంతగా… హైఎస్ట్ ఆఫీస్ నెట్ అబ్సార్ప్షన్‌ సాధించిన విషయాన్ని గుర్తుచేసిన కెటిఆర్‌… ప్రైమ్ ఆఫీస్ రెంటల్ గ్రోత్‌లో కూడా… హైదరాబాద్… ప్రపంచంలోనే బెస్ట్ పెర్ఫార్మింగ్ నగరంగా నిలిచిందన్నారు. ఇందుకు సంబంధించిన సిటీ మూమెంటం ఇండెక్స్‌2020 జాబితాను మంత్రి కేటీఆర్‌ విడుదల చేశారు. ఈ లిస్టులో మొదటి 20 స్థానాల్లో భారత్‌కు చెందినవి 7 నగరాలున్నాయి. చెన్నై (5వ స్థానం), ఢిల్లీ (7వ స్థానం), పుణె (12వ స్థానం), కోల్‌కతా (16వ స్థానం), ముంబై (20వ స్థానం) ఉన్నాయి.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/