బిజెపి ఎంపిపై మంత్రి గంగుల విమర్శలు

Gangula kamalakar
Gangula kamalakar

కరీంనగర్‌: బిజెపి ఎంపి బండి సంజయ్ పై తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్‌ విరుచుకుపడ్డారు. ఆదివారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. కరీంనగర్‌ అభివృద్ధి కోసం గడచిన ఎనిమిది నెలల్లో ఎంపి సంజయ్ కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. తమ పై తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలని ఆయన సూచించారు. అదేదో అభివృద్ధిపై దృష్టి సారించాలని ఎంపికి మంత్రి హితవు పలికారు. మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బిజెపికీ అభ్యర్థులే లేరని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రెండో స్థానం కోసం బిజెపి, కాంగ్రెస్‌ పోటీ పడుతున్నాయని ఆయన ఆరోపించారు. అసలు బండి సంజయ్ లెటర్‌హెడ్‌ చూస్తేనే కేంద్ర మంత్రులు భయపడుతున్నారని మంత్రి గంగుల అన్నారు. సంజయ్ లెటర్‌ హెడ్‌లో అన్నీ తప్పుడు ఫిర్యాదులేనని ఆయన తీవ్రంగా విమర్శించారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/