సీఎం జగన్ మాటలకు, చేతలకు పొంతన ఉండదు
25 ఎంపీ సీట్లు గెలిపిస్తే ప్రత్యేక హోదా తెస్తానని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు

అమరావతి: 25 ఎంపీ సీట్లు గెలిపిస్తే ప్రత్యేక హోదా తెస్తానని చెప్పిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు ఎందుకు ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం లేదని టిడిపి సీనియర్ నేత ధూలిపాళ్ల నరేంద్ర విమర్శించారు. హోదా అంశాన్ని పక్కన పెట్టింది మీరు కాదా? అని ప్రశ్నించారు. ఈ రోజు మంగళగిరిలో టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..సీఎం జగన్ చెప్పే మాటలకు, చేతలకు పొంతన ఉండదని అన్నారు. ఇంకా వైఎస్సాఆర్‌సిపి నేతలు కులపరమైన రాజకీయాలు ఎన్నాళ్లు చేస్తారని ధూళిపాళ్ల ప్రశ్నించారు. తాడేపల్లి, నంబూరులో ఏ సామాజిక వర్గాలు ఉన్నాయని నిలదీశారు. మా అమ్మాయికి తెల్లరేషన్ కార్డు ఉందని అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. బెయిల్ కార్డులు, జైల్ కార్డులు, బినామీ కార్డులు ఉన్నది మీ ముఖ్యమంత్రి జగన్‌కేనని ఎద్దేవా చేశారు. తాడేపల్లిలో సీఎం జగన్ ఇల్లు కూడా ఆయన పేరు మీద లేదని అన్నారు. లోటస్‌పాండ్‌లోని ఇల్లు సీఎం పేరు మీద ఉందా? అని ప్రశ్నించారు. వైఎస్సాఆర్‌సిపి ప్రభుత్వం వచ్చాక జాతి పక్షులన్నీ ఒక చోటుకు చేరాయని ధూలిపాళ్ల నరేంద్ర దుయ్యబట్టారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/