ఏపీలో జడ్జిగా ఎంపికైన తెలంగాణ యువతి

తెలంగాణకు చెందిన ఓ యువతి ఏపీలో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. ఏపీ హైకోర్టు జూనియర్ సివిల్ జడ్జి నియామక ఫలితాల్లో హన్మకొండకు చెందిన పరిమి అలేఖ్య (24) ఫస్ట్ ర్యాంక్ సాధించారు. ఆమె హైదరాబాద్లోని పెండేకంటి కాలేజీలో లా చదివారు. ప్రస్తుతం ఉస్మానియా వర్సిటీలో పీజీ సెకండియర్ చదువుతున్నారు. కాగా ఆమె తల్లి పరిమి మాధవీలత రంగారెడ్డి జిల్లా కోర్టు సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్నారు.

ఈ సందర్భంగా అలేఖ్య మాట్లాడుతూ..ఆంధ్రప్రదేశ్ లో జూనియర్ సివిల్ జడ్జి ఫలితాలలో నేను సెలెక్ట్ కావడం చాలా ఆనందంగా ఉందన్నారు. పట్టుదలతో కష్టబడి చదివితే సాధ్యం కానిది ఏదీ లేదన్నారు. ముఖ్యంగా యువతీ యువకులు చదువును గాలికి వదిలేయకుండా.. ప్రభుత్వం వేసే ప్రతి నోటిఫికేషన్ గురించి తెలుసుకొని.. ప్రిపేర్ అయితే తప్పక విజయం సాధించ వచ్చన్నారు.