నేడు సుప్రీంకోర్టుకు వజోత్సవం..
భారత సర్వోన్నత న్యాయస్థానం వత్రోత్సవాలకు సిద్ధమైంది. 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి రాగా, అదే ఏడాది జనవరి 28న ప్రారంభమైన సుప్రీంకోర్టు నేటితో 75 ఏళ్లను పూర్తిచేసుకుంది. ఈరోజు మధ్యాహ్నం ప్రధాని modi వేడుకలను ప్రారంభించనున్నారు. సీజేఐ జస్టిస్ చంద్రచూడ్తో పాటు సుప్రీం న్యాయమూర్తులు, కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు.
ఈ 75 ఏళ్లలో సీజేఐలుగా ఇద్దరు తెలుగు వ్యక్తులు సేవలు అందించడం విశేషం. సుప్రీంకోర్టు చరిత్రలో ఇప్పటి వరకు 49 మంది CJIలు, 191 మంది న్యాయమూర్తులు సేవలందించారు. వీరిలో ఇద్దరు CJIలు (జస్టిస్ కోకా సుబ్బారావు, జస్టిస్ ఎన్వీ రమణ), 12 మంది జడ్జిలు తెలుగువారున్నారు. సీనియారిటీ ప్రకారం తెలుగు వ్యక్తి జస్టిస్ శ్రీనరసింహ 2027 OCTలో CJIగా నియమితులయ్యే అవకాశం ఉంది. కాగా 1989లో సుప్రీంకోర్టులో తొలి మహిళా న్యాయమూర్తిగా జస్టిస్ ఫాతిమా రికార్టులకెక్కారు. మొత్తంగా ఏడుగురు సేవలందించారు.