అమెరికా లో ఘోర రోడ్డు ప్రమాదం : తెలుగు యువకుడు మృతి

అమెరికా లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణ కు చెందిన యువకుడు మృతి చెందాడు. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం కపెట్ట గ్రామానికి చెందిన బోయ మహేశ్ (25) ఉన్నత చదువుల కోసం గత డిసెంబర్‌లో అమెరికా వెళ్లాడు. అక్కడ కాంకోర్డియా యూనివర్శిటీలో ఎమ్‌ఎస్ చేస్తున్నాడు.
మంగళవారం రాత్రి తన ముగ్గురు స్నేహితులు శివ, శ్రీలక్ష్మి, భరత్‌తో కలిసి లాంగ్ డ్రైవ్‌కు వెళ్లాడు. ఈ క్రమంలో వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మహేశ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మిగతావారు తీవ్రంగా గాయపడ్డారు. మహేష్ మరణ వార్తను అతని కుటుంబ సభ్యులకు తెలియజేసారు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మహేష్ మృతదేహాన్ని భారత్‌కు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.