మరోసారి తేజ – రానా కాంబో

డైరెక్టర్ తేజ – దగ్గుపాటి రానా కలయికలో మరో చిత్రం రాబోతుంది. గతంలో వీరిద్దరి కలయికలో నేనే రాజు నేనే మంత్రి మూవీ వచ్చి భారీ విజయాన్ని సాధించింది. ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబో లో సినిమా రాబోతుంది. ప్రస్తుతం తేజ..రానా తమ్ముడు అభిరామ్ తో ‘అహింస’ సినిమా చేసాడు. ఈ సినిమా జూన్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాతో అభిరాం హీరోగా ఎంట్రీ ఇవ్వడం విశేషం.

ఈ సినిమా తరువాత తేజ ఏ హీరోతో సినిమా చేస్తాడని అంత మాట్లాడుకుంటుండగా..దానికి సమాధానంగా రానా పేరు వినిపిస్తోంది. రానా ను హీరోగా పెట్టి తేజ సినిమా చేయబోతున్నాడట. ఈ సినిమాకి ఆచంట గోపీనాథ్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన ప్రకటన త్వరలోనే వెలువడనుంది.