పిడుగురాళ్ళలో తెలంగాణ మద్యం స్వాధీనం

సుమారు రూ. 4 లక్షలు విలువ చేసే సరుకు పట్టివేత

Telangana state liquor seized
Telangana state liquor seized

Piduguralla : పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ పట్టణ పోలీసులు భారీ మొత్తంలో తెలంగాణ మద్యం ను స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం తెల్లవారు జామున సి.ఐ మధుసూధన్ రావు ఆధ్వర్యంలో చేపట్టిన తనిఖీల్లో బిస్కెట్ పెట్టెల మాటున ఉంచిన 2000 మద్యం సీసాలను తెలంగాణ నుండి వినుకొండకు వాహనంలో తరలిస్తుండగా, పిడుగురాళ్ళ మండలం తుమ్మల చెరువు టోల్ ప్లాజా వద్ద తనిఖీల్లో తెలంగాణ మద్యం సీసాలు పట్టుబడ్డాయి. సుమారు 4 లక్షల రూపాయలు విలువ చేసే 50 మద్యం కేసులను గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు పట్టణ యస్.హెచ్.ఒ మధుసూధన్ రావు తెలిపారు

‘తెర’ (సినిమా) వార్తల కోసం : https://www.vaartha.com/news/movies/