నేటి నుంచి మూడు రోజుల పాటు కర్ణాటకలో రాష్ట్రపతి పర్యటన

president-droupadi-murmu-on-three-day-visit-to-karnataka

న్యూఢిల్లీ: మూడు రోజుల పాటు కర్ణాటకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటిస్తారని రాష్ట్రపతి భవన్​ ఓ ప్రకటనలో తెలిపింది. రాష్ట్రపతి హోదాలో ద్రౌపది ముర్ము తొలి రాష్ట్ర పర్యటన ఇదేనని తెలిపింది. ఈ నెల 26 నుంచి 28 వరకు ముర్ము ​అక్కడే ఉంటారు. సోమవారం మైసూరులో దసరా ఉత్సవాలను ప్రెసిడెంట్​ ప్రారంభిస్తారు. హుబ్లీ ధార్వాడ్​ మున్సిపల్​ కార్పొరేషన్​ ఆధ్వర్యంలో జరిగే పౌర సన్మాన కార్యక్రమానికి హాజరవుతారు. మంగళవారం బెంగళూరులో హిందుస్తాన్​ ఏరోనాటిక్స్​ లిమిటెడ్​కు చెందిన ఇంటిగ్రేటెడ్​ క్రయోజెనిక్​ ఇంజిన్​ల తయారీ ప్లాంట్​ను ఓపెన్​ చేస్తారు. బెంగళూరులో ఆమె గౌరవార్థం కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటుచేసే విందులో పాల్గొంటారు. తర్వాత 28న ఢిల్లీకి తిరిగి వస్తారని రాష్ట్రపతి భవన్ ప్రకటించింది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/