టిక్‌టాక్‌..అమెరికాకు చైనా హెచ్చరిక

టిక్ టాక్ పై నిషేధానికి ట్రంప్ నిర్ణయం

america-china
america-china

చైనా: టిక్ టాక్, వుయ్ చాట్ వంటి యాప్ లను మరో 45 రోజుల్లో నిషేధించే ఉత్తర్వులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకాలు చేయడంపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్ బిన్ మాట్లాడుతూ, తమ దేశానికి చెందిన వాణిజ్య సంస్థలకు తమ ప్రభుత్వ మద్దతు ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో కొన్ని పర్యవసానాలు కూడా ఉంటాయని, వాటిని ఎదుర్కొనేందుకు అమెరికా సిద్ధంగా ఉండాలని వాంగ్ వెన్ బిన్ పేర్కొన్నారు. కాగా, అమెరికాలో తమపై నిషేధాన్ని న్యాయపరంగా తేల్చుకోవాలని టిక్ టాక్ యాజమాన్యం భావిస్తోంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/