రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుభాకాంక్షలు

తెలంగాణ సీఎం గా రేవంత్ రెడ్డి ని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించడం తో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. రేపు ఉదయం రేవంత్ సీఎం గా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే, ప్రమాణస్వీకారోత్సవానికి తొలుత రాజ్‌భవన్‌లో అధికారులు ఏర్పాట్లు చేసినప్పటికీ.. ఎల్బీ స్టేడియంలో రేవంత్‌ ప్రమాణం చేస్తారని కాంగ్రెస్‌ వర్గాలు తాజాగా వెల్లడించాయి. ప్రస్తుతం అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇదిలా ఉంటె రేవంత్ సీఎం అయినా నేపథ్యంలో సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున విషెష్ అందిస్తున్నారు. టీపీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన సమయంలో రేవంత్‌ని తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం ఇప్పుడు రేవంత్ తన బెస్ట్ విషెష్ ను అందించారు. ట్విట్టర్ వేదికగా ‘సీఎల్పీ నేతగా, తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎంపికైన రేవంత్ రెడ్డి సోదరుడికి అభినందనలు. తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబ పాలనను కూలదోసి ప్రజాస్వామ్య ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు’’ అంటూ వెంకటరెడ్డి ట్వీట్ చేశారు. గతంలో ఇద్దరూ ఒకే వేదికపై ఉన్న ఫొటోను ఆయన షేర్ చేశారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కూడా ‘ఎక్స్’ వేదికగా రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.