హీరో మంచు మ‌నోజ్ కారుకు చలాన్ విధింపు

మ‌నోజ్ న‌డుపుతోన్న‌ కారును ఆపిన ట్రాఫిక్ పోలీసులు.. బ్లాక్ ఫిల్మ్ తొల‌గింపు

హైదరాబాద్: హైదరాబాద్‌లో ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించి వాహనాలు నడిపేవారిపై ట్రాఫిక్‌ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖులు, సినీ సెలిబ్రిటీలు నుంచి సామాన్యుల వరకు అందరిపై కొరడా ఝుళిపిస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఇప్పుడు ట్రాఫిక్ పోలీసుల‌కు హీరో మంచు మ‌నోజ్ నిబంధ‌న‌లు ఉల్లంఘించి దొరికిపోయాడు. హైదరాబాద్‌లోని టోలిచౌకిలో ట్రాఫిక్‌ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తోన్ స‌మ‌యంలో మనోజ్ కారు న‌డుపుతూ వెళ్తున్నాడు.

ఆ కారును ఆపిన పోలీసులు దాని అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఉంద‌ని, రూ.700 చలాన్ విధించారు. అలాగే, అద్దాల‌కు ఉన్న‌ బ్లాక్ ఫిల్మ్ ను తొలగించారు. కాగా, ఇటీవలే జూనియర్‌ ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, కల్యాణ్ రామ్‌ కార్ల‌ను కూడా త‌నిఖీ చేసిన పోలీసులు వాటికి ఉన్న‌ బ్లాక్ ఫిల్మ్‌ ను తొలగించి చలానాలు విధించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/