నేడు హైదరాబాద్ కు రానున్న అమిత్ షా..

కేంద్రమంత్రి అమిత్ షా నేడు హైదరాబాద్ కు రానున్నారు. ఖమ్మంలో గురువారం నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొనేందుకు గాను అమిత్ షా ఈ రోజు రాత్రి హైదరాబాద్ కు అమిత్ షా వస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా రేపు ఉదయం టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళిని కలుస్తుండడం ఆసక్తి గా మారింది. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ను బీజేపీ రాజ్యసభకు నామినేట్ చేసింది. అదే సమయంలో ఆయన రజాకార్ ఫైల్స్ పేరుతో సినిమాలు తెరకెక్కిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. గతంలో ట్రిపుల్ ఆర్ సినిమా ఆస్కార్ గెలుచుకున్న సందర్భంగా.. అమిత్ షా హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు ఓ స్టార్ హోటల్‌లో విందు ఇచ్చేలా షెడ్యూల్ ఖరారైంది. కానీ తీరిక లేని షెడ్యూల్ కారణంగా ఆ విందు భేటీ రద్దయింది. ఈ సారి రాజమౌళి ఒక్కరే అమిత్ షాతో భేటీ అయ్యే అయ్యే అవకాశం ఉంది.

ప్రధాని మోడీ 9ఏళ్లలో చేసిన అభివృద్ధిని మహాజన సంపర్క్‌ అభియాన్‌లో భాగంగా ఈ నెల 15న ఖమ్మంలో బీజేపీ అగ్రనేత అమిత్‌ షా బహిరంగసభ నిర్వహించనున్నారు. ఆయన పర్యటన షెడ్యూల్‌ను తెలంగాణ బీజేపీ విడుదల చేసింది. ఈ నెల 15న భద్రాచలంలో రాములవారి దర్శనంతో అమిత్‌ షా తన తెలంగాణ పర్యటనను ప్రారంభిస్తారు.

అమిత్ షా షెడ్యూల్ విషయానికి వస్తే..

బుధవారం అర్ధరాత్రి హైదరాబాద్‌ చేరుకుంటారు. శంషాబాద్ లోని నోవాటెల్‌ హోటల్‌లో బస చేస్తారు. గురువారం ఉదయం తెలంగాణ రాష్ట్ర బీజేపీ ముఖ్యనేతలతో సమావేశమవుతారు. మధ్యాహ్న భోజనం చేశాక.. 2 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి భద్రాచలం చేరుకుంటారు. అక్కడ రాములవారిని దర్శించుకున్న తర్వాత, హెలికాప్టర్‌లో ఖమ్మం చేరుకుంటారు. ఎన్టీఆర్‌ శత జయంతి సందర్భంగా ఆయన ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పిస్తారు. ఆ తర్వాత ఖమ్మంలో ఏర్పాటు చేసిన పార్టీ బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం.. 7.30 గంటలకు బయలుదేరి రోడ్డు మార్గం ద్వారా గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కణ్నుంచీ ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్‌ వెళ్లనున్నారు.