నేటి నుంచి తెలంగాణలో ఇంటర్ పరీక్షల ఫీజుల చెల్లింపు

హైదరాబాద్ : తెలంగాణలో ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ కు సంబంధించిన పరీక్షల ఫీజుల తేదీలను ఇంటర్​ బోర్డు ఖరారు చేసింది. నేటి నుంచి ఈ నెల 24 వరకు ఫీజు చెల్లించవచ్చని ఇంటర్ బోర్డు తెలిపింది. నిర్ణీత సమయంలో ఫీజు చెల్లించని వారు.. లేటు ఫీజుతో ఫిబ్రవరి 21 వరకు ఫీజు చెల్లించవచ్చని ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ తెలిపారు. లేటు ఫీజు రూ. 100తో ఈనెల 25 నుంచి 31 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో ఫిబ్రవరి 1 నుంచి 7 వరకు, అలాగే, రూ.1000 ఆలస్య రుసుముతో ఫిబ్రవరి 8 నుంచి 14 వరకు, రూ.2 వేలతో ఫిబ్రవరి 15 నుంచి 21 వరకు ఫీజు చెల్లించవచ్చని వివరించారు. ఇటీవల మొదటి సంవత్సరం ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంప్రూవ్​మెంట్ రాసుకోవచ్చునని స్పష్టం చేశారు. కాగా, ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/