పుల్వామాలో ఎన్ కౌంటర్ ..ముగ్గురు ఉగ్రవాదులు హతం
Jammu and Kashmir encounter
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్లో మరోసారి ఎన్ కౌంటర్ జరిగింది. జమ్ముకశ్మర్ రాష్ట్రంలోని పుల్వామా చంద్ గామ్ లో ఇవాళ ఉదయం ఎన్ కౌంటర్ జరిగింది. పుల్వామాలో పరిధిలోని చంద్ గామ్ లో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో ఈరోజు కశ్మీర్ పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా గాలింపు చేపట్టాయి. ఈ సందర్భంగా భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అయితే భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హత్యమయ్యారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/