వీధి కుక్కల కట్టడికి 13 మార్గదర్శకాలను విడుదల చేసిన తెలంగాణ సర్కార్

వీధి కుక్కల కట్టడి విషయంలో తెలంగాణ సర్కార్ 13 మార్గదర్శకాలను విడుదల చేసింది. మూడు రోజుల క్రితం పెద్ద అంబర్ పేట్ లో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ దాడి పట్ల స్థానికులు , ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు GHMC ఫై పలు విమర్శలు చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. 13 కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

మార్గదర్శకాలు

1.కుక్కల కుటుంబ నియంత్రణ వేగవంతం చేయడం…

2.కుక్కలు ఎక్కువ గా ఉన్న ప్రాంతాలను గుర్తించి కుక్క కాటు ప్రమాదాల నియంత్రణ…

  1. సిటిజన్స్ ghmc పరిధి లో హెల్ప్ లైన్ నెంబర్ 04021111111…

4.మాసం దుఖణలు హోటల్స్ వారు వ్యర్థలను రోడ్స్ పై వేయకుండా ghmc వాహనాలకు మాత్రమె ఇవ్వాలి…

5.కుక్కల స్థితి ని ghmc ,స్వచ్ఛంద సంస్థలతో ప్రజలకు అవగాహన కల్పించాలి….

6.స్కూల్స్ లో విద్యార్థులు విధి కుక్కల పట్ల ఎలా వ్యవహారించాలని వివరించాలి….

7.కాలనీ సంఘాలు,బస్తి లలో వచ్చే నెల రోజులు కుక్క కాటు పై అవగహన కల్పించాలి….

8.Ghmc పరిధిలో ఉన్న అన్ని రకాల శానిటేషన్ సిబ్బంది తో ఆయా ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలి….

9.కాలనిలే కాకుండా ,మూసి పరిసర ప్రాంతాల్లో,చెట్లు ఎక్కువ ప్రాంతాల్లో ని కుక్కలను సైతం ఆపరేషన్ వేయడం,రేబిస్ టీకా వేయడం చేయాలి…

10.విధి కుక్కల దత్తత తీసుకోవడం పై అవగహన….

11.కుక్క కాటు కు గురైన వారి పూర్తి వివరాలు సేకరించి సరైన సమయంలో వైద్యం, ఇతర సహకారాలు అందించడం.

  1. విధి కుక్కల పట్ల ఎలా వ్యవహారించాలన్న దానిపై హోర్డింగ్స్,పోస్టర్స్, బిల్ బోర్డ్స్ తో ప్రచారం…
  2. విధి కుక్కల కోసం ప్రజలకు దూరంగా నీటి పాత్రలు GHMC ఉంచాలని సూచించింది. అలాగే, జీహెచ్‌ఎంసీ పరిధిలో వీధి కుక్కల బెడదపై 040 21111111 నంబరుకు ఫోన్‌ చేసిన వెంటనే తగిన చర్యలు తీసుకునేలా, మైజీహెచ్‌ఎంసీ యాప్‌ ద్వారానూ ఫిర్యాదులు స్వీకరించేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించింది.