ఐశ్వర్యారాయ్ నిబద్ధత : హృతిక్ వ్యాఖ్య

అంకితభావం చూసి ఆకర్షితుడయ్యానని వెల్లడి

A Still From Dhoom-2
A Still From Dhoom-2

‘ధూమ్ 2`లో మొదటిసారి ఐష్ తో కలిసి పనిచేసినప్పుడు తన ఆలోచనల్లో మార్పు వచ్చిందని హృతిక్ చెప్పాడు. ఐశ్వర్యారాయ్ నిబద్ధత .. కాన్ సన్ ట్రేషన్… చేసే పని పట్ల అంకితభావం చూసి ఆకర్షితుడిని అయ్యానని తెలిపాడు.

‘ధూమ్ 2’ తరువాత  ఈ జోడీ ‘జోధా అక్బర్’.. ‘గుజారీష్’ చిత్రాలతో అభిమానులను రంజింపజేశారు. రెండు సినిమాలకు ప్రేక్షకుల నుంచి క్రిటిక్స్ నుంచి ప్రశంసలు లభించాయి.

ప్రస్తుతం మహమ్మారీ కారణంగా ఇద్దరు నటులు ఇంట్లో స్వీయ-నిర్బంధంలో ఉన్నారు.

హృతిక్ రోషన్ చివరిసారిగా టైగర్ ష్రాఫ్ – వాణీ కపూర్ లతో కలిసి ‘వార్’ చిత్రంలో కనిపించాడు. తదుపరి ఫరా ఖాన్ ‘సత్తే పె సత్తా’ రీమేక్ లో కనిపించనున్నట్లు సమాచారం.

అయితే దానిని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

మరోవైపు ఐశ్వర్య రాయ్.. మణిరత్నం తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నెగెటివ్ రోల్ పోషించనుంది.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/