సీఎం కెసిఆర్ త్వరగా కోలుకోవాలి : గవర్నర్ తమిళిసై

కేసీఆర్‌కు పుష్పగుచ్చం పంపిన గవర్నర్ తమిళిసై
కేసీఆర్ ఆసుపత్రికి వెళ్లారని తెలిసి ఆందోళనకు గురయ్యానన్న గవర్నర్

Tamilisai Soundararajan
Tamilisai Soundararajan


హైదరాబాద్ : సీఎం కెసిఆర్ కు నిన్న వైద్య పరీక్షలను నిర్వహించిన యశోదా ఆసుపత్రి వైద్యులు వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించిన విషయం తెలిసిందే. అయితే సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని గవర్నర్ తమిళిసై ఆకాంక్షించారు. ఆయనకు పుష్పగుచ్ఛం పంపించారు. సీఎంగారు త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ప్రార్థిస్తున్నానని పుష్పగుచ్ఛంతో పాటు పంపిన లేఖలో తమిళిసై పేర్కొన్నారు. అనారోగ్య సమస్యలతో కేసీఆర్ ఆసుపత్రికి వెళ్లారని తెలిసి ఆందోళనకు గురయ్యానని చెప్పారు.

మరోవైపు బీబీనగర్ లోని ఎయిమ్స్ లో జరిగిన 2021-22 ఎంబీబీఎస్ బ్యాచ్ విద్యార్థుల వైట్ కోట్ సెరమొనీ కార్యక్రమానికి గవర్నర్ హాజరయ్యారు. అక్కడ ప్రసంగిస్తూ సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వైద్య వృత్తి కష్టమైనా డిప్రెషన్ కు గురి కావద్దని విద్యార్థులకు సూచించారు. వైద్య సేవలు అందించడం కష్టమైనా జాగ్రత్తగా పని చేయాలని చెప్పారు. వైద్య విద్యార్థులు పరిశోధన, విద్య, ఆటలతో పాటు అన్ని రంగాల్లో పాల్గొంటూ సంతోషంగా వైద్య విద్యను అభ్యసించాలని అన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/international-news/