ఏడాది పాలన..ప్రధాని మోడి బహిరంగ లేఖ

ఈ లేఖ ద్వారా మీ ఆశీస్సులు కోరుకుంటున్నా

Thanks to people _ Modi Tweet
PM MODI

న్యూఢిల్లీ: ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడి జాతినుద్దేశించి లేఖ రాశారు. లేఖలో ఏడాది కాలంగా తీసుకున్న కీలక నిర్ణయాలను ప్రస్తావించారు. ‘నా దేశ పౌరులారా.. గతేడాది ఇదే రోజు భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం ప్రారంభమైంది. అనేక దశాబ్దాల తరువాత దేశ ప్రజలు పూర్తి మెజారిటీతో పూర్తికాలం అధికారం కట్టబెట్టారు. మరోసారి 130 కోట్ల భారతీయులకు, దేశ ప్రజాస్వామ్య సంస్కృతికి తలవంచి నమస్కరిస్తున్నా. మీ ప్రేమ, సహృదయత, చురుకైన సహకారం కొత్త శక్తిని, స్ఫూర్తిని ఇచ్చాయి. సాధారణ సమయంలో అయితే మీ మధ్యనే ఉండేవాణ్ణి. అయితే, ఇప్పుడున్న పరిస్థితులు నన్ను అనుమతించటం లేదు. అందుకే ఈ లేఖ ద్వారా మీ ఆశీస్సులు కోరుకుంటున్నా… అంటూ మోడి పేర్కొన్నారు.


నా భారతీయ పౌరులరా, గడిచిన ఏడాది కాలంలో కొన్ని నిర్ణయాలను విస్తృతంగా చర్చించటంతోపాటు బహిరంగ సభలలో కూడా ప్రస్తావించారు. ఆర్టికల్ 370 దేశ సమైక్యతనుమ, సమగ్రతా స్ఫూర్తిని మరింతగా పెంచింది. గౌరవ సుప్రీంకోర్టు ఏకగ్రీవంగా ఇచ్చిన రామమందిరం తీర్పు శతాబ్దాలకాలంగా సాగుతున్న చర్చకు సుహృద్భావపు ముగింపునిచ్చింది. క్రూరమైన ట్రిపుల్‌ తలాక్‌ విధానాన్ని చరిత్ర అనే చెత్తబుట్టకు పరిమితం చేశాం. పౌరసత్వ చట్టానికి చేసిన సవరణ భారతదేశపు కరుణ, కలుపుకుపోయే తత్వాన్ని చాటిచెప్పింది. కానీ దేశాన్ని అభివృద్ధిపథంలో పరుగులు పెట్టించిన నిర్ణయాలు ఇంకా అనేకం ఉన్నాయి…. మన దేశ విజయం కోసం ప్రార్థిస్తూ, మీకు మరోమారు ప్రణమిల్లుతున్నా. మీకు, మీ కుటుంబానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.ఆరోగ్యంగా ఉండండి, సురక్షితంగా ఉండండి. అప్రమత్తంగా ఉండండి, తెలిసి నడుచుకొండి. మీ ప్రధాన సేవకుడు నరేంద్ర మోడి’ గత ఏడాది కాలంగా చేపట్టిన వివిధ సంస్కరణల గురించి ప్రధాన మంత్రి నరేంద్రమోడి సుదీర్ఘ లేఖ రాశారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/