సీఎం జగన్‌కు చంద్రబాబు నాయుడు సవాల్‌

రాజధాని మార్పునకు ప్రజామోదం ఉందనుకుంటే..రెఫరెండం నిర్వహించండి

Chandrababu Naidu
Chandrababu Naidu

అమరావతి: విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ సమీపంలోని వేదిక కళ్యాణ మండపంలో అమరావతి పరిరక్షణ జేఏసి కార్యాలయాన్ని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజధాని మార్పునకు మీరు తీసుకున్న నిర్ణయానికి ప్రజామోదం ఉందనుకుంటే..రెఫరెండం నిర్వహించండని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డికి చంద్రబాబు నాయుడు సవాల్‌ విసిరారు. ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఏ తీర్పు ఇస్తే దానికి కట్టుబడి ఉంటానన్నారు. లేదనుకుంటే రాజధాని మార్పు ఎజెండాగా మళ్లీ ఎన్నికలకు రండి. ప్రజల్లోకి వెళ్దాం..వారే తీర్పు ఇస్తారని చంద్రబాబునాయుడు అన్నారు. ఎవరు అడిగారని..ఏం అధికారం ఉందని రాజధాని మార్పునకు సీఎం జగన్‌ పూనుకున్నారని విమర్శించారు. కులం మతం అంటున్నారు ప్రాంతం అంటున్నారు. రాజధాని కోసం పోరాడుతున్న సీసీఐ నేత రామకృష్ణదీ నాదీ ఒకే కులామా? అని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని ప్రశ్నించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/