‘చోర్ బజార్’ నుంచి లిరికల్ సాంగ్ విడుదల

హీరో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా ఆవిష్కరణ

Akash Puri and Gehana Sippy in 'Chor Bazaar' movie
Akash Puri and Gehana Sippy in ‘Chor Bazaar’ movie

ఆకాష్ పూరీ హీరోగా నటిస్తున్న సినిమా ‘‘చోర్ బజార్’’. గెహన సిప్పీ నాయికగా నటిస్తోంది. దళం, జార్జ్ రెడ్డి సినిమాలతో తన మార్కు క్రియేట్ చేసుకున్న జీవన్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు. ఐ.వి ప్రొడక్షన్స్ పతాకంపై వీ.ఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా థియేటర్ లలో విడుదలకు సిద్ధమవుతోంది. లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న “చోర్ బజార్” సినిమా నుంచి సాంగ్స్ ప్రమోషన్ స్టార్ట్ చేశారు. తాజాగా ఈ చిత్రంలోని ‘అబ్బబ్బా ఇది ఏం పోరి’ లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు.

YouTube video

హీరోయిన్ అందాన్ని వర్ణిస్తూ సాగే పాట ఇది. పాట ఎలా ఉందో చూస్తే..అబ్బబ్బా ఇది ఏం పోరి..చూడగానే కళ్లు చెదిరి, కోసేసానమ్మో దాని జడపై మనసు పడి…మెడకీ నడుముకి నడుమ నాగుబాములాగ కదలాడి..ఉరిబోసిందమ్మో దాని కురులతో ఊపిరికి..అంటూ సాగుతుందీ పాట. సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందించిన ఈ పాటను రామ్ మిర్యాల ఆకట్టుకునేలా పాడారు. మిట్టపల్లి సురేందర్
సాహిత్యాన్ని అందించారు. భాను కొరియోగ్రఫీ చేసిన ఈ పాటలో సీనియర్ నాయిక అర్చన, హీరో ఆకాష్ పూరీ కనిపిస్తారు.  “చోర్ బజార్” సినిమా త్వరలో థియేటర్ ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.

ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం : https://www.vaartha.com/andhra-pradesh/