తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌ రాజీనామా

governor-tamilisai

హైదరాబాద్‌: గవర్నర్‌ పదవికి తమిళిసై సౌందర్‌రాజన్‌ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పదవికి కూడా రాజీనామా చేశారు. కాగా, లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడు నుంచి పోటీ చేస్తారని తెలుస్తున్నది. చెన్నై సెంట్రల్‌ లేదా తూత్తుకూడి నుంచి బీజేపీ టికెట్‌ ఇవ్వనున్నట్లు సమాచారం. తమిళిసై గతంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా పనిచేసిన విషయం తెలిసిందే.