WHO మరో వార్నింగ్‌..

ప్రపంచ ఆరోగ్య సంస్థ మరో హెచ్చరిక జారీచేసింది..ఓమిక్రాన్ పెద్దగా ప్రమాదం ఉండదని, రెండు , మూడు రోజులు కాస్త ఒళ్లునొప్పులు , జలుబు, దగ్గు , జ్వరం అనే కానీ ఏమిఉండదని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఓమిక్రాన్ చాల డేంజర్ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.

ఒమిక్రాన్‌ బారిన పడ్డ వారు హాస్పటల్ లలో చేరుతున్నారని పేర్కొంది డబ్ల్యూహెచ్‌ఓ. ఇదే చివరి వేరియంట్‌ అని చెప్పలేమని స్పష్టం చేసింది. వారం వ్యవధిలో 71 శాతం ఒమిక్రాన్‌ కేసులు పెరిగాయని… ఒమిక్రాన్‌ వేరియంట్‌ పై చాలా జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్‌ ఇచ్చింది డబ్ల్యూహెచ్‌ఓ.

డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ మాట్లాడుతూ.. ‘డెల్టాతో పోలిస్తే వ్యాక్సిన్ వేసుకున్నవారిలో ఒమిక్రాన్ ప్రభావం తక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. అంతమాత్రాన ఒమిక్రాన్‌ను తక్కువగా అంచనా వేయొద్దు. గతంలో వెలుగుచూసిన వేరియంట్స్ లాగే ఒమిక్రాన్ కారణంగా ఆసుపత్రుల్లో కేసులు పెరిగిపోతున్నాయి. ఇది మనుషుల ప్రాణాలను హరిస్తోంది.’ అని పేర్కొన్నారు. కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో హెల్త్ కేర్ సిస్టమ్‌పై ఒత్తిడి పెరుగుతోందన్నారు.