తెలంగాణ లో రేపటి నుండి విద్యా సంస్థలకు దసరా సెలవులు

తెలంగాణ లో రేపటి నుండి విద్యా సంస్థలకు దసరా సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. తెలంగాణ ప్రజలు ఎంతో ఘనంగా దసరా పండగను జరుపుకుంటారని సంగతి తెలిసిందే. ప్రభుత్వం సైతం బతుకమ్మ ఉత్సవాలను ప్రతి ఏడాది ఎంతో అట్టహాసంగా జరుపుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థలకు దసరా సెలవులు ప్రకటించింది.రేపు 13వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకు దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి.

13 రోజుల సెలవుల అనంతరం అక్టోబరు 26న బడులు పునఃప్రారంభమవుతాయి. ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు సమ్మెటివ్‌ అసెస్‌మెంట్‌(ఎస్‌ఏ-1) పరీక్షలు బుధవారంతో ముగిశాయి. ఆ పరీక్షల ఫలితాలు సెలవుల అనంతరం వెల్లడిస్తారు. మరో వైపు ఫార్మెటివ్‌ అసెస్‌మెంట్‌-1, 2 పరీక్షల మార్కులను గురువారం లోపు చైల్డ్‌ ఇన్ఫోలో నమోదు చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అన్ని జూనియర్‌ కళాశాలలకు ఈ నెల 19వ తేదీ నుంచి దసరా సెలవులు ప్రారంభమవుతాయి.