ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పై స్పందించిన సీఎం యోగి

బీజేపీ నిర్ణ‌యం త‌ర్వాతే పోటీ చేస్తా.. సీఎం యోగి

ల‌క్నో : సీఎం యోగి ఆదిత్య‌నాథ్ 2022లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో జ‌ర‌గ‌బోయే అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై స్పందించారు. తాను ఎన్నిక‌ల్లో పోటీ చేసే అంశంపై బీజేపీ నిర్ణ‌యం తీసుకుంటుందని, ఆ త‌ర్వాతే ఎన్నిక‌ల బ‌రిలో దిగుతాన‌ని యోగి శుక్ర‌వారం ప్ర‌క‌టించారు. ఎక్క‌డ్నుంచి పోటీ చేసే విష‌యంపై అప్పుడే స్ప‌ష్ట‌త వ‌స్తుంద‌న్నారు. ఎక్క‌డి నుంచి ఎవ‌రు పోటీ చేయాల‌నేది బీజేపీ పార్ల‌మెంట‌రీ బోర్డు నిర్ణ‌యిస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. 2017 ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల‌న్నింటిని నెర‌వేర్చామ‌ని సీఎం పేర్కొన్నారు.

త‌న ప‌ద‌వీ కాలంలో శాంతి భ‌ద్ర‌త‌ల‌ను కాపాడ‌మ‌ని తెలిపారు. దీపావ‌ళితో పాటు అన్ని పండుగ‌ల‌ను శాంతియుత వాతావ‌ర‌ణంలో జ‌రుపుకున్నామ‌ని చెప్పారు. తాము ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కాల‌ న్నీ అర్హులంద‌రికీ చేరాయ‌న్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/