బిఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కూతురుపై కేసు నమోదు

తన తండ్రే ఆయనతో కేసు పెట్టించారంటున్న భవాని

case-filed-on-brs-mla-muthireddy-daughter

జనగామః బిఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కుమార్తె తుల్జా భవానీరెడ్డిపై చేర్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. తండ్రీకూతుళ్లకు మధ్య గత కొంతకాలంగా చేర్యాలలో భూమికి సంబంధించిన వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో 1270 గజాల స్థలం చుట్టూ ఉన్న ఫెన్సింగ్ ను నిన్న ఆమె కూల్చివేశారు. తన పేరు మీద ఉన్న భూమి చుట్టూ ఉన్న ప్రహరీని కూల్చివేశారు.

అంతేకాదు, చేర్యాల మున్సిపాలిటీకి తన భూమిని అప్పగించనున్నట్టు ప్రకటించారు. అయితే ఆ భూమి పక్కన ఉన్న తన భూమి ఫెన్సింగ్ ను కూడా ఆమె కూల్చేశారంటూ పక్క స్థల యజమాని రాజు భాయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంకోవైపు, తన తండ్రే రాజు భాయ్ తో తనపై కేసు పెట్టించారని భవాని ఆరోపిస్తున్నారు.