మత్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభించిన సిఎం

మత్స్యకారుల అకౌంట్లలో రూ. 10 వేల చొప్పున జమ

jagan mohan reddy
jagan mohan reddy

అమరావతి: ఏపిలో మత్స్యకార భరోసా పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రారంభించారు. తాడేపల్లి క్యాంపు ఆఫీసులో ఈ పథకాన్ని ప్రారంభించగానే ఏపిలోని సుమారు లక్షా తోమ్మిది వేల మంది మత్స్య కార కుటుంబాలకు లభ్ధిచేకురింది. వారి వారి అకౌంట్‌లలో రూ. 10 వేల చొప్పున జమ అయ్యాయి. ఈ సందర్బంగా జగన్‌ మాట్లాడుతూ.. కరొనా వ్యాప్తి నేపథ్యంలో సముద్రంలో చేపల వేట నిషేధించాము. ఈ సమయంలో మత్స్యకార కుటుంబాలకు సాయం చేయాలని వారికి పదివేల ఆర్ధిక సాయం అందిస్తున్నామని అన్నారు. ప్రభుత్వానికి చాలా ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా మత్స్యకారుల కష్టాలు పెద్దవిగా భావించి వారికి సాయం చేస్తున్నామని అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/