యాదాద్రి ప్రెసిడెన్షియల్ సూట్‌ ప్రారంభించిన సీఎం కేసీఆర్

యాదాద్రి: సీఎం కేసీఆర్ ఇవాళ యాదాద్రి పర్యటనకు వెళ్లారు. నూనతంగా నిర్మించిన ప్రెసిడెన్షియల్ సూట్‌, వీవీఐపీ కాటేజీలు, విల్లాలను ఆయన ప్రారంభించారు. అనంతరం వాటిని పరిశీలించారు. తర్వాత యాదాద్రి యాగశాలను ఆయన పరిశీలించనున్నారు. తదనంతరం భువనగిరి జిల్లా సమీకృత కలెక్టరేట్ ను ప్రారంభించనున్నారు. అనంతరం టీఆర్ఎస్ జిల్లా ఆఫీసును ప్రారంభించి.. కలెక్టరేట్ పక్కన జరిగే బహిరంగ సభలో మాట్లాడనున్నారు.

కాగా, ప్రెసిడెన్షియల్ సూయిట్ ను 1,500 చదరపుటడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. లక్ష్మీనృసింహుడి ఆలయ వీక్షణ కోసం అందులో ప్రత్యేకంగా ఒక వ్యూ పాయింట్ ను ఏర్పాటు చేశారు. యాదాద్రి చిన్నకొండపై 14 విల్లాలు, ఒక మెయిన్ సూయిట్ ను 13.25 ఎకారల్లో నిర్మించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/