మీకంటే పెద్ద దొంగలు, మూర్ఖులు ఎవరుంటారు పప్పూ?

యిన‌ప్ప‌టికీ కాపాడటం మీ తప్పుకాదా? అన్న విజయసాయి

అమరావతి : అర్ధరాత్రి అక్రమంగా టీడీపీ నేత, ఎమ్మెల్సీ అశోక్ బాబుని అరెస్ట్ చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానంటూ ఆ పార్టీ నేత నారా లోకేశ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే. సీపీఎస్‌ను రద్దు చెయ్యమని నిలదీయడం ఆయన చేసిన తప్పా? అని, పీఆర్సీ విషయంలో అన్యాయం జరిగిందని ఉద్యోగుల తరపున పోరాడటం నేరమా? అని ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌కు వైస్సార్సీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ప‌రోక్షంగా కౌంట‌ర్ ఇచ్చారు.

”మీకంటే పెద్ద దొంగలు, మూర్ఖులు ఎవరుంటారు పప్పూ. అశోక్ బాబు దొంగ సర్టిఫికేట్ తో ఉద్యోగం చేస్తున్నాడని ఫిర్యాదులొచ్చినా కాపాడటం మీ తప్పుకాదా? ఉద్యోగుల సంఘం లీడర్ గా లేపి ప్యాకేజిలిచ్చి, చివరకు ఎమ్మెల్సీని చేశారు. నారా వారి సీఆర్‌పీసీలో రాత్రిపూట అరెస్టులు చేయ‌కూడ‌ద‌ని ఏమైనా ఉందా?” అని విజ‌య సాయిరెడ్డి ప్ర‌శ్నించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/