భవిష్యత్ ప్రణాళికలపై రేపు తెలంగాణ మంత్రివర్గం భేటి
రేపు మధ్యాహ్నం 3గంటలకు ప్రారంభం కానున్న సమావేశం

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా నివారణ కొరకు లాక్‌డౌన్ అమలు చేస్తుండడంతో ఏర్పడిన పరిస్థితులు, భవిష్యతలో అనుసరించాల్సిన వ్యూహలపై చర్చించేందుకు రేపు కెసిఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం భేటికానుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, లాక్‌డౌన్ సమస్యలు, పంట కొనుగొళ్లు, రాష్ట్రంలో కురుస్తున్న వానలు, పంటనష్టం రైతులకు అందించాల్సిన సాయం, భవిష్యత్ ప్రణాళికలు తదితర విషయాలపై చర్చించనున్నారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/