సార్క్‌ ఎమర్జెన్సీ ఫండ్‌కు పాక్‌ విరాళం

మూడు మిలియన్‌ డాలర్లు ఇస్తున్నట్లు వెల్లడి

imran khan
imran khan

ఇస్లామాబాద్‌: కరోనా పై పోరులో సార్క్‌ దేశాలను ఏకతాటిపైకి తీసుకురావాలని మోదీ తీసుకున్న నిర్ణయంతో ఏకీభవిస్తు ఇప్పటికే పలు దేశాలు నిధులను అందజేశాయి. తాజాగా ఈ జాబితాలో పాకిస్తాన్‌ కూడా చేరింది. సార్క్‌ ఎమర్జెన్సి ఫండ్‌ కు మూడు మిలియన్‌ డాలర్లు అందజేస్తామని హామి ఇచ్చింది. ఇందుకు సంబందించి పాక్‌ విదేశాంగ కార్యదర్శి, సార్క్‌ ప్రధాన కార్యదర్శి ఎసలా రువాన్‌ వీరకూన్‌కు సమాచారం అందించారు. అయితే ఈ నిధులకు సంబందించి అన్ని ప్రక్రియలు సార్క్‌ కార్యదర్శి నియంత్రణలోనే జరగాలని , నిధుల వినియోగంలో అన్ని సభ్యదేశాలను సంప్రదించి,విస్తుృతంగా చర్చించిన తరువాతే నిర్ణయం తీసుకోవాలని పాక్‌ సూచించింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/