ఈనెల 29 న తెలంగాణ కేబినెట్ భేటీ..

తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడుతుంది. ఈ క్రమంలో ఈ నెల 29 న తెలంగాణ కేబినెట్ భేటీ నిర్వహించబోతున్నారు. ఈ మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ అంశంపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. అవసరం అనుకుంటే అంతకు ముందే ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నట్లు తెలుస్తుంది. అనాథ చిన్నారుల కోసం ప్రత్యేక విధానాన్ని కూడా ఆమోదించే అవకాశం ఉంది.

ఇటీవల జిల్లాల పర్యటనల సందర్భంగా కేసీఆర్ పలు హామీలు ఇచ్చారు. వాటిలో కొన్నింటికి మంత్రివర్గం ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్ లు మరియు ఇతర కొత్త పథకాలపైన కూడా భేటీలో మాట్లాడనున్నారు. వీటితో పాటు ప్రభుత్వం ఇద్దరినీ ఎమ్మెల్సీల కోసం ప్రతిపాదించి గవర్నర్ కు పంపగా రాజ్యాంగం ప్రకారం వీరి ఎంపిక లేదని ఆమోదం తెలపలేదు. దీనిపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.