దసరా డైరెక్టర్ కు బీఎమ్ డబ్ల్యూ కారును గిఫ్ట్ గా ఇచ్చిన నిర్మాత

చిత్రసీమలో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్స్ కు హీరోలు , నిర్మాతలు విలువైన వస్తువులు బహుమతులుగా ఇస్తుంటారు. తాజాగా దసరా డైరెక్టర్ శ్రీకాంత్ కు..నిర్మాతలు బీఎమ్ డబ్ల్యూ కారును గిఫ్ట్ గా ఇచ్చారు. నాని – కీర్తి సురేష్ జంటగా శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో తెరకెక్కిన దసరా మూవీ శ్రీరామ నవమి కానుకగా పాన్ ఇండియా గా పలు భాషల్లో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ వారం రోజుల్లో రూ.100 కోట్ల క్లబ్ లో చేరింది.

ఈ నేపథ్యంలో ‘కరీంనగర్’లో దసరా మూవీ సక్సెస్ మీట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను సాధించినందుకు శ్రీకాంత్ ఓదెలకి నిర్మాత సుధాకర్ చెరుకూరి ‘బీఎమ్ డబ్ల్యూ’ కారును గిఫ్ట్ గా ఇస్తున్నట్టుగా సుమ ప్రకటించింది. అందుకు సంబంధించిన ‘కీ’ని ఆయన శ్రీకాంత్ కి ఈ స్టేజ్ పై అందజేశాడు. ఆ సమయంలో స్టేజ్ ఉన్న మిగతా వాళ్లంతా తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.