భోళా శంకర్ నుండి జాం జాం జాం జాం జజ్జనక సాంగ్ ప్రోమో రిలీజ్

వాల్తేర్ వీరయ్య తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి..ప్రస్తుతం భోళా శంకర్ మూవీ తో ఆగస్టు 11 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మెహర్ రమేష్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటించగా , కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలుగా నటించింది.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ నుండి జాం జాం జాం జాం జజ్జనక సాంగ్ ప్రోమో ను మేకర్స్ రిలీజ్ చేయగా, కాబోతుంది. ఈ పాట పూర్తి లిరికల్ వీడియోను జులై 11న సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేయనున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ వెల్లడించింది. ఇటీవల ఈ పాట మేకింగ్ వీడియోను చిత్రబృందం పంచుకుంది. సినిమాలోని ప్రధాన తారాగణమంతా ఈ పాటలో స్టెప్పులేయడం ఆ వీడియోలో కనువిందు చేసింది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం ,సుంకర నిర్మాణ సారథ్యంలో ఈ మాస్ ఎంటెర్టైనెర్ తెరకెక్కుతోంది.

YouTube video