గుజరాత్ బిజెపి శాసనసభాపక్ష నేతగా భూపేంద్ర పటేల్ ఎన్నిక

bhupendra-patel-has-been-elected-as-the-leader-of-the-bjp-legislative-party

అహ్మాదాబాద్‌ః గుజరాత్ బిజెపి శాసనసభాపక్ష నేతగా భూపేంద్ర పటేల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అహ్మదాబాద్ లోని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో కొత్తగా ఎన్నికైన 156 మంది ఎమ్మెల్యేలు ఆయన్ను తమ నేతగా ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి పార్టీ కేంద్ర పరిశీలకులుగా బిజెపి సీనియర్ నేతలు రాజ్‌నాథ్ సింగ్, బీఎస్ యడ్యూరప్ప, అర్జున్ ముండా హాజరయ్యారు.

ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బిజెపి ఘనవిజయం సాధించడంతో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేసేందుకు భూపేంద్ర పటేల్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్ కు అందజేశారు. ఘట్లోడియా అసెంబ్లీ స్థానం నుంచి 1.92 లక్షల ఓట్లతో భూపేంద్ర పటేల్ భారీ విజయం సాధించారు.

డిసెంబర్ 12న కొత్త ప్రభుత్వ ప్రమాణస్వీకారోత్సవం జరుగుతుందని రెండోసారి సీఎంగా భూపేంద్ర పటేల్ ప్రమాణస్వీకారం చేస్తారని ఇప్పటికే ఆ పార్టీ చీఫ్ సీఆర్ పాటిల్ఇప్పటికే ప్రకటించారు. ఆ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా కూడా హాజరకానున్నారు. కాగా గత ఏడాది సెప్టెంబర్‌లో గుజరాత్ ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ స్థానంలో పటేల్ బాధ్యతలు చేపట్టారు.

ఇటీవల వెలువడిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 182 స్థానాలకుగానూ 156 స్థానాలను గెలుచుకొని చరిత్ర సృష్టించింది. కాంగ్రెస్ 17 స్థానాలతో సరిపెట్టుకుని రెండవ స్థానంలో నిలువగా, ఆప్ 5 అసెంబ్లీ సెగ్మెంట్లలో విజయం సాధించింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/