రూ. 2,90,396 కోట్లతో రాష్ట్ర బడ్జెట్
వ్యవసాయానికి, నీటిపారుదల శాఖకు భారీగా కేటాయింపులు

హైదరాబాద్‌ః ఆర్థిక మంత్రి హరీశ్‌రావు రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బడ్జెట్‌ను హరీశ్‌రావు చదివి వినిపిస్తున్నారు.
తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తోంది
తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తోంది అన్న స్థాయిలో రాష్ట్రం దూసుకుపోతుంది. ఆర్థిక మాంద్యం, కరోనా సంక్షోభాలను తట్టుకుని రాష్ట్రం నిలబడింది. తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలో ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారింది. సంక్షోభ సమయాల్లో సమర్థవంతంగా ఆర్థిక నిర్వహణతో మన్ననలు పొందింది.
రూ. 2,90,396 కోట్లతో రాష్ట్ర బడ్జెట్
రూ. 2,90,396 కోట్లతో రాష్ట్ర బడ్జెట్.. రెవెన్యూ వ్యయం రూ. 2,11,685 కోట్లు. పెట్టుబడి వ్యయం రూ. 37,525 కోట్లు.
నిరుడు మార్చి 7న రూ.2.71 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
వ్యవసాయానికి, నీటిపారుదల శాఖకు భారీగా కేటాయింపులు
వ్యవసాయానికి కేటాయింపులు రూ. 26,831 కోట్లు.
నీటిపారుదల శాఖకు రూ. 26,885 కోట్లు.
విద్యుత్ కేటాయింపులు రూ. 12,727 కోట్లు.
సంక్షేమానికి భారీగా నిధులు
ఆసరా పెన్షన్ల కోసం రూ. 12 వేల కోట్లు
దళితబంధు కోసం రూ. 17,700 కోట్లు
బీసీ సంక్షేమం కోసం రూ. 6,229 కోట్లు
మహిళా, శిశు సంక్షేమం కోసం రూ. 2,131 కోట్లు.
ఎస్సీ ప్రత్యేక నిధి కోసం రూ. 36,750 కోట్లు
మైనార్టీ సంక్షేమం కోసం రూ. 2,200 కోట్లు
గిరిజన సంక్షేమం, ప్రత్యేక ప్రగతి నిధికి రూ. 15,223 కోట్లు