వాసాల‌మ‌ర్రి గ్రామానికి ద‌ళిత బంధు నిధులు విడుద‌ల‌

హైద‌రాబాద్ : సీఎం కెసిఆర్ ద‌త్త‌త గ్రామం వాసాల‌మ‌ర్రి గ్రామానికి ద‌ళిత బంధు నిధుల‌ను విడుద‌ల చేశారు. వాసాల‌మ‌ర్రిలోని 76 ద‌ళిత కుటుంబాల‌కు రూ. 7.60 కోట్లు విడుద‌ల చేశారు. ఈ మేర‌కు నిధుల విడుద‌ల‌కు ఎస్సీ అభివృద్ధి శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ద‌ళిత బంధు నిధులు విడుద‌ల కావ‌డంతో వాసాల‌మ‌ర్రి ద‌ళితులు సంబురాలు చేసుకుంటున్నారు. సీఎం కేసీఆర్‌కు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. త‌మ‌పై ద‌య చూపిన కేసీఆర్‌కు రుణ‌ప‌డి ఉంటామ‌ని పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్ చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం చేసి అభిమానాన్ని చాటుకున్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/