తెలంగాణ బిజెపి అధ్యక్ష పదవికి బండి సంజయ్ రాజీనామా

కేంద్రంలో బండి సంజయ్ కి కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం

bandi-sanjay

హైదరాబాద్‌ః తెలంగాణ బిజెపిలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేశారు. మంగళవారం ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. ఆ తర్వాత సంజయ్ తన రాజీనామాను సమర్పించారు. కేంద్రంలో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు గత కొన్నిరోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. పార్టీ అధ్యక్ష రేసులో ఈటల రాజేందర్ పేరూ వినిపించింది. తెలంగాణ బిజెపి కొత్త అధ్యక్షుడు ఎవరనేది సాయంత్రం వెలువడే అవకాశాలు ఉన్నాయి.