పెరిగిన ఎల్పీజీ సిలిండర్ల ధర

ఒక్కో కమర్షియల్ సిలిండర్‌పై రూ.7 పెంపు

Commercial LPG cylinders
Commercial LPG cylinders

న్యూఢిల్లీః చమురు మార్కెటింగ్ కంపెనీలు మంగళవారం కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరలను పెంచాయి. డొమెస్టిక్ సిలిండర్ ధరలను మాత్రం యథాతథంగా ఉంచారు. ఒక్కో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్‌పై రూ.7 చొప్పున పెంచారు. తాజా పెంపు తర్వాత న్యూఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.1,773 నుండి రూ.1,780కి పెరిగింది. కోల్‌కతాలో రూ.1,902కు, ముంబైలో రూ.1,740, చెన్నైలో రూ.1,952కి పెరిగాయి. అంతకుముందు, జూన్ నెలలో 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్‌ ధర రూ.83.50 తగ్గింది.

ఓ వైపు కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర గత కొన్ని నెలలుగా పెరుగుతూ, తగ్గుతూ ఉండగా, 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు మాత్రం దాదాపు స్థిరంగా ఉంటున్నాయి. చివరిసారి మార్చి 1, 2023న రూ.50 పెరిగింది. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.1,103గా ఉంది.