తెలంగాణ రికార్డు స్థాయిలో బీర్ల అమ్మకాలు

తెలంగాణ లో ఎండలు ఏ రేంజ్ లో దంచికొడుతున్నాయో తెలియంది కాదు..ఉదయం 8 గంటలకే భానుడు భగభగమంటున్నాడు. ఎండవేడికి తట్టుకోలేక ప్రజలు ఇంటికే పరిమితం అవుతున్నారు. ఎన్ని పనులు ఉన్న సాయంత్రం చల్లబడిన తర్వాతే చూసుకుంటున్నారు తప్ప బయటకు వెళ్లడం లేదు. కొంతమంది మాత్రం బయటకు వెళ్లనేది పనులు జరగవని వెళ్తున్నారు. ఇక ఈ ఎండ తాపాన్ని తగ్గించుకునేందుకు మందుబాబులు బీర్లను తెగతాగేస్తున్నారు.

ఈ నెల 1 నుంచి మార్చి 18 వరకు దాదాపు 670 కోట్ల రూపాయల బీర్లను తాగినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఈ 18 రోజుల్లో 23,58,827 కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. గత సంవత్సరంతో పోలిస్తే బీర్ల అమ్మకాలు 28.7 శాతం పెరిగి బీర్ల అమ్మకాల్లో ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పింది. ఏప్రిల్ నెలలోనే ఇలా తాగితే.. మే నెలలో ఇంకా ఎండలు ఇంకాస్త బాగా ఉంటాయి..అప్పుడు ఏ రేంజ్ అమ్మకాలు సాగుతాతో అంచనా వేయవచ్చు. కాగా ప్రస్తుతం ప్రభుత్వం కూడా రోజు రోజుకు పెరిగిపోతున్న బీర్ల అమ్మకాలకు తగ్గట్టుగా స్టాక్ అందుబాటులో ఉంచుతున్నట్లు తెలుస్తుంది.