తెరాస మీటింగ్ లో దళిత మంత్రికి ఘోర అవమానం

దళితుల కోసం కేసీఆర్ ప్రతి క్షణం ఆలోచిస్తారని..వారి కోసం దళిత బందు ను తీసుకొచ్చారని..దళితుల కోసం కేసీఆర్ ఎన్నో తీసుకొచ్చారని గొప్పలు చెపుతున్న తెరాస నేతలు..తాజాగా తెరాస మీటింగ్ లో దళిత మంత్రి ని అవమానించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

ఎన్నికల ప్రచార సభలో నా తమ్ముడు గెల్లు శ్రీనివాస్ యాదవ్. తెలంగాణ ఉద్యమంలో పనిచేశాడు. కేసీఆర్ ఆశీస్సులతో మీ ముందుకొచ్చాడని మంత్రి కొప్పుల ఈశ్వర్ చెపుతుండగా ..ఆ వెంటనే పక్కనున్న వ్యక్తి మంత్రి కొప్పుల ఈశ్వర్ చేతిలోని మైక్‌ని లాగేసుకుని మరీ మంత్రి హరీశ్‌కి స్వాగతం చెప్పడం కలకలం రేపుతోంది. హరీశ్ వచ్చాడని సాటి మంత్రి, అందులోనూ దళిత సామాజిక వర్గానికి చెందిన మంత్రి చేతిలో నుంచి మైక్ లాక్కోవడం హాట్‌టాపిక్‌గా మారింది.

మంత్రి కొప్పుల వద్ద నుంచి మైక్ లాక్కుంటున్న వీడియోను మాజీ ఐపీఎస్ ఆర్‌ఎస్ ప్రవీణ్ షేర్ చేసి.. ఇంకెంతకాలం ఈ అవమానాలు భరిస్తారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘కొప్పుల ఈశ్వర్ గారూ, కనీస సంస్కారం లేని దొరల-గడీల పార్టీలో ఎంతకాలం ఇట్ల అవమానాలు భరిస్తూ బందీగుంటరు? ఐదు సార్లు MLA ఐన మీ గుండె ఎన్ని సార్లు గాయపడ్డదో మీతో కలసి పనిచేసిన నాకు తెలియంది కాదు. అందుకే గడీలలో బందీలైన సమస్త బహుజననాయకుల్లారా, ఇకనైనా బానిసత్వ సంకెళ్లు తెంపుకోండి’’ అంటూ భావోద్వేగంతో ట్వీట్ చేశారు.

@Koppulaeshwar1⁩ గారూ, కనీస సంస్కారం లేని దొరల-గడీల పార్టీలో ఎంతకాలం ఇట్ల అవమానాలు భరిస్తూ బందీగుంటరు? ఐదు సార్లు MLA ఐన మీ గుండె ఎన్ని సార్లు గాయపడ్డదో మీతో కలసి పనిచేసిన నాకు తెలియంది కాదు. అందుకే గడీలలో బందీలైన సమస్త బహుజననాయకుల్లారా, ఇకనైనా బానిసత్వ సంకెళ్లు తెంపుకోండి pic.twitter.com/nX5k4ty7Nk— Dr. RS Praveen Kumar (@RSPraveenSwaero) October 22, 2021