రూ.500 గ్యాస్ కోసం ..ఎల్‌పీజీ పంపిణీ కేంద్రాల వద్ద భారీ క్యూ

తెలంగాణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ పథకాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.500 గ్యాస్ ఇస్తామని గట్టిగ ప్రచారం చేసారు. ఇక ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడం , రేవంత్ సీఎం అవ్వడం..ప్రకటించిన 6 గ్యారెంటీ పథకాల్లో ఇప్పటికే మహాలక్ష్మి , రాజీవ్ ఆరోగ్య పథకాలను ప్రారంభించడం జరిగింది.

ఇక రూ.500 లకే గ్యాస్ ఇస్తామనన్నారు..ఎప్పుడు ఇస్తారో అని అంత ఎదురుచూడడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఎలాగైనా సిలిండర్ సొంతం చేసుకోవాలని ఎల్‌పీజీ పంపిణీ కేంద్రాల వద్దకు చేరుకుని క్యూ కడుతున్నారు. పథకాన్ని ఎప్పటినుంచి ప్రారంభిస్తారని నిర్వాహకులను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ కేవైసీ చేయించుకున్న వారికే ఇస్తారన్న ప్రచారం జరుగుతూండటంతో ఈ కేవైసీ చేయించుకునేందుకు పోటీ పడుతున్నారు. హైదరాబాద్‌ తో పాటు ఇతర జిల్లాల్లోనూ ఇదే పరిస్థఇతి కనిపిస్తోంది. ఏజెన్సీ ఉద్యోగులు మాత్రం మహాలక్ష్మి పథకానికి ఈకేవైసీకి సంబంధం లేదని, కాబట్టి డిసెంబర్ 31 లోగా చేసుకోవాలని వారికి చెబుతున్నారు. వెంటనే అప్‌డేట్ చేయకుంటే సబ్సీడీలు వెంటనే నిలిపివేస్తారని ఏజెన్సీలు మహిళలకు సూచిస్తున్నాయి.