కరీంనగర్‌లో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

Road Accident in karimnagar
Road Accident in karimnagar

కరీంనగర్: జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఆటోను గ్రానైట్ లారీ ఢీ కొనడంతో ఈ విషాదం జరిగింది. గంగాధర మండలం, కురిక్యాల దగ్గర ఆటోను గ్రానైట్ లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆటోలో డ్రైవర్ ఇరుక్కుపోయాడు. అరగంటసేపు శ్రమించి డ్రైవర్ మృత దేహాన్ని వెలికితీశారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు. నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఆటోలో ఉన్న ఐదుగురు చనిపోయారు. మృతులు మేక బాబు, నర్సయ్య, గడ్డం అంజయ్య, శేఖర్, పాలెయ్యగా గుర్తించారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని, కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/