సుకుమార్ గడ్డానికి కలర్ వేస్తున్న అల్లు అర్జున్

సుకుమార్ గడ్డానికి కలర్ వేస్తున్న అల్లు అర్జున్

సుకుమార్ – అల్లు అర్జున్ మంచి సన్నిహితులు అనే సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ కు యూత్ లో క్రేజ్ రావడానికి ప్రధాన కారణం సుకుమారే. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఆర్య మూవీ బన్నీ కి మంచి పేరును మాత్రమే కాదు యూత్ కు బాగా దగ్గర చేసింది. వీరిద్దరి కలయికలో ఆర్య 2 వచ్చి మ్యూజికల్ విజయం సాధించింది. ఆర్య నుండి కూడా వీరు చాల క్లోజ్ గా ఉంటూ వస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరి కలయికలో పుష్ప మూవీ వస్తుంది.

ఈ షూటింగ్ కు సంబదించిన ఓ పిక్ ఇప్పుడు వైరల్ గా మారింది. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో ఉన్న సుక్కు గెడ్డానికి బన్నీ బ్రష్‌తో బ్లాక్ కలర్ వేస్తున్న ఫొటో బయటకు వచ్చి తెగ చక్కర్లు కొడుతుంది. సుక్కు కోసం బన్నీ మేకప్ మాన్ అయ్యాడని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ పార్ట్‌ 1.. పుష్ప ది రైజ్ డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సునీల్, అనసూయ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ రోల్ ప్లే చేస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నారు.