స్కాట్లాండ్ పై టీమిండియా ఘన విజయం

6.3 ఓవర్లలోనే లక్ష్య ఛేదన

TeamIndia solid win over Scotland
TeamIndia solid win over Scotland

దుబాయ్ లో స్కాట్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో స్కాట్లాండ్ పై 8 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజ‌యం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ 17.4 ఓవర్లలో 85 పరుగులకు ఆలౌట్ కాగా… 86 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 6.3 ఓవర్లలో విజయం సాధించింది.
కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ తిరుగులేని ఆటతీరుతో స్కాట్లాండ్ బౌలింగ్ ను చిత్తూ చేశారు. రాహుల్ 19 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 50 పరుగులు చేయగా, రోహిత్ శర్మ 16 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ తో 30 పరుగులు నమోదు చేశాడు. వీరిద్దరూ అవుటైనా కెప్టెన్ కోహ్లీ (2 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్ (6 నాటౌట్) మిగతా పని పూర్తి చేశారు. సూర్యకుమార్ ఓ సిక్స్ తో ఇన్నింగ్స్ కు ముగింపు పలికారు. ఈ విజయంతో టీమిండియా గ్రూప్-2 పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది. . ప్రస్తుతం గ్రూప్-2లో అన్ని జట్లు నాలుగేసి మ్యాచ్ లు ఆడాయి. పాక్ జట్టు 4 మ్యాచ్ లు ఆడి 4 విజయాలతో అగ్రస్థానంలో ఉండగా, కివీస్ 4 మ్యాచ్ ల్లో 3 విజయాలు…. భారత్ 4 మ్యాచ్ ల్లో 2 విజయాలు నమోదు చేసుకుంది.

ఆంధ్ర ప్రదేశ్ వార్తల కోసం :https://www.vaartha.com/andhra-pradesh/