సిరీస్ కైవసం

ఆఖరి వన్డేలో ఇంగ్లండ్ పై టీమ్‌ఇండియా విజయం

Team India win the series
Team India win the series

ఆఖరి వన్డేలో 330 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఆంగ్లేయులపై టీమ్‌ఇండియా 7 పరుగుల తేడాతో విజయదుందుభి మోగించింది. సిరీస్‌ను కూడా 2-1తో కైవసం చేసుకుంది. భువీ (3), శార్దూల్‌ (4)తో కూడిన బౌలింగ్‌ దళం లక్ష్యాన్ని కాపాడుకుంది. సామ్‌ కరన్‌ (95*; 83 బంతుల్లో 9×4, 3×6 ), డేవిడ్‌ మలన్‌ (50; 50 బంతుల్లో 6×4) విఫల పోరాటం చేశారు. శామ్ కర్రాన్(95 నాటౌట్: 83 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సులు)

తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 330 టార్గెట్ చేసింది భారత్‌ను రిషభ్‌ పంత్‌ (78; 62 బంతుల్లో 5×4, 4×6), హార్దిక్‌ పాండ్య (64; 44 బంతుల్లో 5×4, 4×6) ఆదుకొన్నారు. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (67; 56 బంతుల్లో 10×4) ఆకట్టుకున్నాడు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/